top of page
MediaFx

కాళ్లబేరానికి వచ్చిన మాల్దీవులు.. భారతీయులకు రిక్వెస్ట్


ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి.. బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పును తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది.దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీమ్ ఫైజల్ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. ‘మనకు ఓ చరిత్ర ఉంది.. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా (భారత్‌తో) కలిసి పనిచేయాలని కోరుకుంటోంది.. మేము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం... భారతీయుల రాకపోకలకు మా ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతున్నాయి... దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులకు చెప్పాలనుకుంటున్నాను.. మా ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది’ అని అన్నారు.

భారత్‌పైనా, ప్రధాని మోదీపైనా అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు చిర్రెత్తుకొచ్చింది. బాయ్‌కాట్ మాల్దీవులకు అని పిలుపునివ్వడంతో ఆ దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్నవారు మనసు మార్చుకున్నారు. హోటల్ బుకింగ్స్, భారత్ నుంచి ఫ్లైట్ టికెట్ల క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. మాల్దీవుల నష్టనివారణ చర్యలు చేపట్టి భారత్‌పై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లారలేదు.

పర్యాటక వైబ్‌సైట్ sun.mv సోమవారం ప్రకటించిన నివేదిక ప్రకారం.. గత సంవత్సరం మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 42 శాతం తగ్గింది. ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారతీయులు తొలిస్థానంలో ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఆరో స్థానానికి పడిపోయిందని న్యూస్ పోర్టల్ నివేదించింది.

పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మే 4 నాటికి మాల్దీవులకు భారతదేశం నుంచి మొత్తం 43,991 మంది పర్యాటకులు వెళ్లారు. గత ఏడాది ఇదే సమయానికి 73,785 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించడం గమనార్హం. గతేడాదిో పోల్చితే 42,638 మంది తక్కువ.

bottom of page