2024 ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి మలయాళ మూవీ 2018 ఎంట్రీని దకించుకుంది . బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీపడబోతుంది .
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 2018 ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్ 2024 కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీని దకించుకుంది . 96వ ఆస్కార్స్‌లో బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీపడనుంది. ఫైనల్ నామినేషన్స్‌లో ఈ సినిమాకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
2018లో కేరళ వరదల నేపథ్యంలో సర్వైవల్ డ్రామా థ్రిల్లర్‌గా దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ 2018 మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో టొవినో థామస్, కుంచకోబోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ ప్రధాన పాత్రలను పోషించారు. వరదల కారణంగా కొంతమంది జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మనసుల్ని కదిలించేలా ఈ సినిమాలో ఆవిష్కరించారు డైరెక్టర్.మలయాళంలో మే 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా 200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా 2018 మూవీ సరికొత్త చరిత్రను సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమాను అదే పేరుతో నిర్మాత బన్నీవాస్ రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా ఈ ఏడాది నిర్మాతలకు లాభాల్ని మిగిల్చిన డబ్బింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.