top of page

కేరళ స్టైల్‌లో ఇలా చేపల వేపుడు చేయండి..


అరిటాకు ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

మీకు ఇష్టమైన చేపలు లేదా చేప ముక్కలు, అరిటాకులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం.

అరిటాకు ఫిష్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లులి రెబ్బలు, ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని బాగా కడిగి.. ముక్కలు లేదా చేపలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత ముక్కలపై కొత్తిమీర, నిమ్మరసం వేసి వేయండి. ఇలా మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరిటాకును ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేయాలి. ఆ ఆకులకు కొద్దిగా నూనె రాసి.. అందులో చేప లేదా చేప ముక్కలు పెట్టి కట్టాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులో అరిటాకు పొట్లాలను వేసి వేడి చేయాలి. ఇవి బంగారు రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా అరిటాకు ఫిష్ ఫ్రై సిద్ధం. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. కాస్త లేటు అయినా రుచి మాత్రం చాలా బావుంటుంది.

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page