top of page

వయనాడ్ సీట్‌ను వదులుకున్న రాహుల్.. ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ


లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకోసం ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్‌ నుంచి పోటీ చేయనున్నారు. వయనాడ్‌ సీటు నుంచి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించారు.

రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలను జీవితాంతం గుర్తుంచుకుంటానని, వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని తెలిపారు. ఇక రాయ్‌బరేలి సీటు నుంచి ఎంపీగా కొనసాగడం తనకు సంతోషకరమని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని భావించగా, రాహుల్‌ను ఏఐసీసీ అభ్యర్థిగా ప్రకటించింది. రాయ్‌బరేలి కాంగ్రెస్‌ కంచుకోటగా ఉంది. 1951 నుంచి ఈ సెగ్మెంట్‌లో కేవలం మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. ఫిరోజ్‌ గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. 1962, 1999లో మాత్రమే నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయలేదు. 1952, 1957లో ఫిరోజ్‌ గాంధీ ఎంపీగా గెలిచారు.

దాదాపు పదేళ్ల గ్యాప్‌ తర్వాత ఇందిరాగాంధీ వరుసగా రెండు సార్లు గెలిచారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్‌ నారాయణ్‌ గెలిచారు. 1980లో మరోసారి ఇందిరాగాంధీ గెలిచారు. ఆ తర్వాత అరుణ్‌ నెహ్రూ, షీలా కౌల్‌ చెరో రెండుసార్లు గెలిచారు. 1996-98లో బీజేపీ నేత అశోక్‌ సింగ్‌ గెలిచారు.

1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి సతీష్‌ శర్మ గెలిచారు. 2004 నుంచి ఐదుసార్లు సోనియా గాంధీ రాయ్‌బరేలీలో గెలిచారు. 1952-2019లో కాంగ్రెస్‌ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిపోయింది. 2019లో రాహుల్‌ వయనాడ్‌లో ఘనవిజయం సాధించారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page