top of page
Suresh D

సరిహద్దులు దాటేసినా గుంటూరు కారం మూవీ.. 🎥✨

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా ఈ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా ఈ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఇప్పటికే ఇండియాలో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉండగా, అంచనాలను తారుమారు చేసి హద్దులు దాటి ఇతర దేశాలను ప్రేక్షకులను ఆకట్టుకుంది.  స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9, 2024 న డిజిటల్ లోకి వచ్చింది. అయితే ఈ మూవీకి వరుసగా ఐదు వారాల పాటు ఓటీటీలో ‘టాప్ ఇండియన్ మూవీస్’లో ఒకటిగా నిలిచింది. భారత సరిహద్దులు దాటి గుంటూరు కారం ఊహించని ప్రభావాన్ని చూపింది. పాకిస్తానీ నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది ఆశ్చర్యకరంగా ట్రెండింగ్ లో ఉంది. ఇక పాకిస్తాన్ ప్రజలు తెలుగు సినిమాలను మరింతగా చూసే అవకాశం ఉంది. ఇటీవల వాళ్లకు పుష్ప సినిమా బాగా నచ్చిందంటూ అందులోని డైలాగ్స్ చెప్పడం ఇండియన్స్ ను ఆశ్చర్యపరచింది.  🎥✨

bottom of page