top of page

దుమ్మురేపిన మహేష్ బాబు .. గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్

గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు గుంటూరు కారం సినిమా ఇండియా వైడ్ గా 42 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నిన్న (జనవరి 12న )గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఆడియన్స్. మొదటి షో నుంచి గుంటూరు కారం సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకుజోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. మహేష్ బాబు మాస్ అవతార్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమా మొత్తం మహేష్ బాబు వన్ మ్యాన్ షోగా నడిపించారు. మహేష్ బాబు యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే.. గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు గుంటూరు కారం సినిమా ఇండియా వైడ్ గా 42 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో గుంటూరు కారం సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి రానున్న రోజుల్లో ఈ  సినిమా ఎంత వసూల్ చేస్తుందో చూడాలి. విదేశాల్లో గుంటూరు కారం సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page