top of page

100 కోట్ల క్లబ్‌లోకి గుంటూరు కారం, కానీ! గుంటూరు కారం 5 డేస్ కలెక్షన్స్

మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ రూ. 100 కోట్ల మార్క్ వైపుగా పయనిస్తోంది. అయితే ఐదో రోజు వచ్చేసరికి కలెక్షన్స్ వచ్చేసరికి రిపోర్ట్ వేరేలా ఉంది. ఇలా వరల్డ్ వైడ్‌గా గుంటూరు కారం 5 డేస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర మరింత పతనమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్ Sacnilk.com నివేదిక ప్రకారం గుంటూరు కారం ఇండియాలో మొదటి మంగళవారం సుమారు రూ .11.5 కోట్లు వసూలు చేసినట్లుగా పేర్కొంది. అయితే, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. గుంటూరు కారం సినిమా నెమ్మదిగా రూ. 100 కోట్ల మార్క్ దిశగా మాత్రం దూసుకుపోతోంది.

ట్రెండింగ్ వార్తలు

గుంటూరు కారం 5 డేస్ కలెక్షన్స్

ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలోకి దిగిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఐదు రోజులకు చేరుకుంది. గుంటూరు కారం సినిమాకు విడుదలైన ఐదు రోజుల్లో రూ. 94.50 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే, సుమారుగా వంద కోట్లకు దగ్గరిగా గుంటూరు కారం మూవీ ఉన్నట్లే తెలుస్తోంది. ఇక సినిమాకు ఐదు రోజుల్లో రూ. 160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సమాచారం.

5వ రోజు తగ్గిన కలెక్షన్స్

అంటే, గ్రాస్ కలెక్షన్స్ పరంగా గుంటూరు కారం వంద కోట్ల క్లబ్‌ను ఈపాటికే దాటేసింది. కానీ, గుంటూరు కారం సినిమాకు సోమవారం అంటే నాలుగో రోజున రూ. 14.1 కోట్లు వచ్చాయి. కానీ, ఐదో రోజైన మంగళవారం మాత్రం రూ. 11.50 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అంటే, నాలుగో రోజుతో పోలిస్తే ఐదో రోజుకి గుంటూరు కారం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. మహేశ్ బాబు సినిమాకు తొలి రోజు ఇండియాలో రూ. 41.3 కోట్లతో భారీ ఓపెనింగ్స్ రాగా తర్వాతి రోజు రూ. 13.55 కోట్లకు కలెక్షన్స్ పడిపోయాయి.

4 రోజుల వసూళ్లు

అలాగే గుంటూరు కారం సినిమాకు ఐదో రోజు 37.24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాకు 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 66.13 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 96.75 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో గుంటూరు కారం మూవీకి నాలుగు రోజుల్లో రూ. 5.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.15 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం మూవీకి నాలుగు రోజుల్లోనే రూ. 84.58 కోట్ల షేర్, రూ. 134.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

హిట్ కొట్టాలంటే..

శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేసిన గుంటూరు కారం సినిమాకు ఇప్పటివరకు 65 శాతానికిపైగా బడ్జెట్ రికవరీ అయినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. గుంటూరు కారం సినిమా హిట్ కొట్టాలంటే ఇంకా సుమారు రూ. 36 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టాలి. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా బడ్జెట్ రూ. 200 కోట్లు అని సమాచారం.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page