top of page
MediaFx

మహేష్‌బాబు వద్దనుకున్నా సినిమాలతో అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యారు

తెలుగు సినీ పరిశ్రమలో ఏ దర్శకుడైనా కథను రాసుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకొనే ఏకైక హీరో మహేష్ బాబు. ఆయనకు కథ నచ్చకపోతేనే అది వేరే హీరో దగ్గరకు వెళుతుంది. పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే ఇది. దర్శకులందరికీ మొదటి ఛాయిస్ ప్రిన్స్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దాదాపు ఇది మూడు సంవత్సరాల సమయం పడుతుందని తెలుస్తోంది. ఒక భాగంగా వస్తుందా? రెండు భాగాలుగా వస్తుందా? అన్న విషయంలో చిత్ర యూనిట్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. ఇది డిసెంబరు ఆరోతేదీన విడుదల కాబోతోంది. మహేష్ బాబు వద్దన్న మూడు కథలు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లాయి. వాటితోనే బన్నీ స్టార్ హీరో అయ్యారంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నారు. దర్శకుడు గుణశేఖర్ ఈ కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించారు. ఆయన వద్దనడంతో అల్లు అర్జున్ చేశాడు. ఈ పాత్రలో బన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన మరో చిత్రం అల వైకుంఠపురం. ఈ కథ కూడా త్రివిక్రమ్ మహేష్ బాబు దగ్గరకే తీసుకువెళ్లాడు. ఆ సమయంలో డేట్లు ఖాళీగా లేకపోవడంతో త్రివిక్రమ్ బన్నీతో చేశాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులను సృష్టించింది. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన మరో సినిమా పుష్ప. ఇది తెలుగులోకన్నా హిందీలోనే ఘనవిజయాన్ని సాధించింది. సుకుమార్ ఈ కథను మహేష్ బాబు దగ్గరకు తీసుకువెళ్లారు. ప్రిన్స్ కొన్ని మార్పులు, చేర్పులు చెప్పారు. అయితే అవి సుకుమార్ కు నచ్చనలేదు. ఇద్దరిమధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో బన్నీ చేశాడు. ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. దీనిపై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మూడు సినిమాలు మహేష్ బాబు చేసివుంటే మరో రకంగా ఉండదని అభిమానులు అంటున్నారు.


bottom of page