సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుందని భావించినా మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు మహేశ్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకుడిగా అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అతడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించిన.. ఖలేజా నిరాశపరిచింది.
కానీ, తర్వాత బుల్లితెరపై ఖలేజా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇలాంటి సినిమానా ప్లాప్ చేశాం అని ప్రేక్షకులు, అభిమానులు అనుకునేలా చేసింది. దీంతో ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం సినిమాపై ఫుల్ క్రేజ్ ఏర్పడింది. గుంటూరు కారం సినిమాలో ముద్దుగుమ్మలు శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక కుర్చీ మడతపెట్టి పాటపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఇక గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ కారణంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు కారం ప్రమోషన్స్ జోరుగా చేసే సమయం ఇది. అందులో భాగంగానే జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు నిర్మాతలు. దాంతో మహేశ్ బాబు అభిమానులు సైతం తెగ సంబరపడిపోయారు.
కానీ, ఇప్పుడు మాత్రం మహేశ్ బాబు అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందింది. జనవరి 6న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడా పోలీస్ లైన్స్‌లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిద్దామనుకున్న నిర్మాతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని పోలీసులు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు. దాంతో ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో మూవీ యూనిట్ తెలిపింది.
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కొత్త తేదీని సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తాం. మమ్మల్ని క్షమించండి అని మేకర్స్ ఆ ప్రకటనలో రాసుకొచ్చారు. దీంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేశ్ బాబు అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే యూసఫ్ గూడాలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో మరో చోట ఈవెంట్ నిర్వహిస్తారని సోషల్ మీడియాలో చర్చలు మొదలు అయ్యాయి.
అయితే, యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్‌లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు అకస్మాత్తుగా దీనిపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన ఘటనే కారణం అని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక జరిగిన సంఘటనలు తెలిసిందే. ఇదిలా ఉంటే గుంటూరు కారం మూవీ స్టోరీ లీక్ అయినట్లు ఇదివరకు ప్రచారం జరిగింది. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని టాక్.🎥📜