top of page

మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన దుల్కర్ సల్మాన్..

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకే బంగారం సినిమా తమిళ్ లో తెరకెక్కి తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. రెండు భాషల్లో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో మహానటి సినిమాలో నటించాడు.

దుల్కర్ సల్మాన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకే బంగారం సినిమా తమిళ్ లో తెరకెక్కి తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. రెండు భాషల్లో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో మహానటి సినిమాలో నటించాడు. జెమిని గణేష్ పాత్రలో నటించిన దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆ తర్వాత ఈ టాలెంటెడ్ హీరో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యి మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కింగ్ ఆఫ్ కోట అనే టైటిల్ తో దుల్కర్ సినిమా రాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియాగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలోనే కింగ్ ఆఫ్ కోట టీజర్ ను రిలీజ్ చేశారు.తెలుగులో ఈ మూవీ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. మలయాళం లో దుల్కర్ తండ్రి మమ్ముట్టి రిలీజ్ చేయగా తెలుగులో మహేష్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. దుల్కర్ మరోసారి ఆకట్టుకునే సినిమా చేస్తున్నాడు అని తెలిపారు మహేష్. దీని పై దుల్కర్ స్పందిస్తూ మహేష్ కు థాంక్స్ చెప్పాడు. థాంక్యూ సో మచ్ అన్న అంటూ మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలుపడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Opmerkingen


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page