top of page

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ బిజినెస్ మాన్ రి రిలీస్ ఎపుడంటే

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీరిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. పోకిరి సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా రీ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో బిజినెస్ మ్యాన్ ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటన యాటిట్యూడ్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ మ్యాన్ కు ముందు పూరి తెరకెక్కించిన నేను నా రాక్షసి, హిందీలో అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ తో తిరిగి హిట్ అందుకున్నారు పూరిజగన్నాథ్. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కానుందని తెలుస్తోంది.మహేష్ బాబు పుట్టిన రోజున బిజినెస్ మ్యాన్ సినిమా రీరిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు. ఆరోజు అభిమానులకు పండగే .. ఆరోజు రక్తదానాలు, అన్నదానాలు అంటూ అభిమానులు సందడి చేస్తారు. అలాగే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా రీ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదే రోజు మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కూడా అప్డేట్ రానుందని తెలుస్తోంది



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page