top of page

త్రివిక్రమ్ మూవీకి సిద్ధం అవుతున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల స్పెయిన్ వెళ్లారు. ఆయన ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఎయిర్పోర్ట్ లో ఆయన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి...

చిన్న విరామం దొరికితే చాలు మహేష్ బాబు విదేశాలకు చెక్కేస్తారు. త్రివిక్రమ్ మూవీ షూట్ గ్యాప్ లో ఆయన స్పెయిన్ కి వెళ్లారు. ఈ ట్రిప్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమైన మహేష్ ని మీడియా కెమెరాల్లో బంధించారు. గడ్డం పెంచిన మహేష్ మాస్ లుక్ కేక పుట్టిస్తుంది. జూన్ మొదటి వారం నుండి ఎస్ఎస్ఎమ్బి 28 చిత్ర షూటింగ్ మొదలుకానుంది. మూడు నెలలు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. దీంతో మహేష్ బాబు సన్నద్ధం అవుతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మహేష్ పాత్ర పై కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. ఇక టైటిల్ విషయంలో కూడా కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం, ఊరికి మొనగాడు వంటి టైటిల్ పరిగణలో ఉన్నాయట.



వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. మహేష్ ఊరమాస్ లుక్ కేక అని అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్ట్ అనంతరం మహేష్ దర్శకుడు రాజమౌళితో మూవీ చేస్తారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథగా ఈ చిత్రం ఉంటుందట. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. ఈ చిత్ర బడ్జెట్ రూ. 800 కోట్లు అంటూ ఓ ప్రచారం జరుగుతుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page