top of page

మహేష్ బాబు సినిమా టైటిల్ చెప్పేసిన రాజమౌళి !


RRR తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం SSMB29 అన్న విషయం అందరికి తెలిసిందే.. మహేష్ బాబు హీరోగా  నటిస్తున్న ఈ సినిమా పై ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.. 

గుంటూరు కారం సినిమా తరువాత మహేష్.. తన టైమ్ మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా రెడీ అవుతున్నాడు మహేష్.

ఈ సినిమాకు సంభందించిన మహేష్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చిన నెట్టింట నిమిషాల్లో వైరల్ అవుతుంది.

మొన్నటివరకు ఈ సినిమా టైటిల్ అది, ఇది అనుకుంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఇక ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ను  రాజమౌళినే ఒక ఈవెంట్ చెప్పుకొచ్చేసాడు.

మీ మైండ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి అని ఒక అభిమాని అడగగానే.. ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ గరుడ.. గరుడ అని అరవడం మొదలుపెట్టారు. ఇక దీనికి సమాధానంగా రాజమౌళి మాట్లాడుతూ.. ” అవును నా మైండ్ లో కూడా గరుడ ఉంది. కానీ, ఇంతకుమించి ఎక్కువ డిటైల్స్ ను నేను ఇప్పుడు బయటపెట్టలేను” అని చెప్పుకొచ్చాడు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page