top of page
Shiva YT

చాలా సింపుల్ గా కనిపించే మహేష్ బాబు చాలా వస్తువులు వాడుతాడు..

కాని అవి కూడా సింపుల్ గానే కనిపిస్తాయి. వాటిని పరీక్షగా చూస్తే కాని వాటి అసలు రూపం బయటకు రాదు. రీసెంట్ గా సూపర్ స్టార్ వాడే బ్యాగ్ కాస్ట్ విని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.

నెటిజన్ల కళ్ళంతా సెలబ్రిటీల మీదే ఉంటాయి. వాళ్లు పెట్టే పోస్ట్ లు.. వాడే వస్తువలు.. వాటి ఖరీదు.. ఇవే పనిగా పెట్టుకుని ఉంటారు కొంత మంది. సెలబ్రిటీలు కనిపిస్తే.. వారి వస్తువలమీద కళ్ళుంటాయి. పొరపాటున వారు వాడే వస్తువు రేర్ గా దొరికేదో.. లేక బాగా కాస్ట్లీదో అయ్యింటే... ఇక దాన్ని వైరల్ చేయడమే వారి పని. ఇక తాజాగా వారి కంటికి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాగుతో సహా దొరికారు.

మహేశ్ బాబు ఎప్పుడు చాలా సింపుల్‌గా ఉంటారు.. సింపుల్ గానే కనిపిస్తారు. హాంగు ఆర్బాటం ఉండదు.. ప్రశాంతంగా ఉంటాడు. ఆయన వేసుకునే బట్టలు.. వాడే వస్తువులు కూడా చాలా సింపులుగా అనిపిస్తాయి. కాని కాస్ట్ చూస్తే మాత్రం బుర్ర పేలిపోవాల్సిందే. పక్కా బ్రాండ్ మెయింటేన్ చేస్తూ.. సింపుల్ గా కనిపించేలా జాగ్రత్త పడుతుంటాడుసూపర్ స్టార్. చిత్రం ఏంటంటేం. ఏదైనా పార్టీలకు, సినిమా వేడుకలకు వచ్చినప్పుడు కూడా సాదాసీదాగానే ఉంటారు. అయితే వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు మాత్రం మహేష్ రిచ్ నెస్ తెలిసిపోతుంది. ఫ్యామిలీతో కలిసి ఏడాదికి ఐదారుసార్లు టూర్లు వెళ్తుంటాడు మహేష్. ఆటైమ్ లో కాస్టీ వస్తువుతో ఎక్కడ దొరికుతాడా అని ఎదురు చూస్తుంటారు నెటిజన్లు. ఇక తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో లూయిస్ విట్టన్ బ్యాగ్‌తో కనిపించాడు మహేష్. దాంతో నెటిజన్లు మొదలు పెట్టేశారు. ఈ బ్యాక్ ను వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకీ దాని స్పెషల్ ఏంటీ.. దాని ధర ఎంత తెలుసా..? దాని ధర తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.. తాజాగా ట్రిప్‌కు వెళ్లిన ఆయన.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాకు కనిపించారు. అప్పుడు మహేష్ భుజానికి కాస్ట్లీ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్‌ ప్యాక్‌తో కనిపించారు. దీంతో ఆ బ్యాగ్‌పై.. దాని ధరపే ఫోకస్ చేశారు నెటిజన్లు. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా.. దాదాపుగా 4 లక్షలు.. అవునండీ.. 8 వేలు తక్కువ నాలుగు లక్షల బ్యాగ్ అది. దానిఅసలు ధర 3 లక్షల 92 వేల 656 రూపాయలు. ఈ విషయం తెలిసిన నెటిజన్లకు బుర్రతిరిగిపోయింది.

bottom of page