top of page

మన్సూర్ అలీఖాన్‌కు మద్రాస్ హైకోర్టు చీవాట్లు.. కేసు త్రిష వేయాలన్న న్యాయమూర్తి🎞️🎥

మన్సూ్ర్ వేసిన పరువునష్టం కేసు  మద్రాసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ నటిపై బహిరంగంగా మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను న్యాయమూర్తి ఖండించారు.

మన్సూ్ర్ వేసిన పరువునష్టం కేసు  మద్రాసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ నటిపై బహిరంగంగా మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను న్యాయమూర్తి ఖండించారు. నిజానికి కేసు మన్సూర్ అలీఖాన్‌పై త్రిష వేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, మన్సూర్ అలీఖాన్‌కు నిత్యం వివాదాల్లోకి దూరడం.. అంతాచేసి తనను తాను అమాయకుడినని చెప్పుకోవడం అలవాటుగా మారిందని న్యాయమూర్తి నిందించారు.అయితే, మన్సూర్ అలీఖాన్ న్యాయవాది తన క్లయింట్ తప్పేమీ లేదని వాదించారు. ఒక ఇంటర్వ్యూలో చిన్న క్లిప్ కట్ చేసి తన క్లయింట్‌పై నిందలు వేశారన్నారు. అలా అయితే, ఇంటర్వ్యూ పూర్తి వీడియో కోర్టుకు చూపించాలని న్యాయమూర్తి అడిగారు. దీనికి మన్సూర్ అలీఖాన్ న్యాయవాది అంగీకరించారు. తాను పూర్తి వీడియోను కోర్టుకు సమర్పిస్తానని.. అయితే, మన్సూర్‌పై త్రిష చేసిన సోషల్ మీడియా పోస్టు తీసేయాలని న్యాయవాది డిమాండ్ చేశారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. త్రిష, ఖుష్బూ, చిరంజీవి వారి స్టేట్‌మెంట్లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. కేసును డిసెంబర్ 22కు వాయిదా వేశారు.🎞️🎥

bottom of page