top of page
MediaFx

సందీప్ కిష‌న్ ‘ప్రాజెక్ట్ Z’ సీక్వెల్.. 'మాయవన్' ఫస్ట్ లుక్ విడుదల🔥


హీరో సందీప్ కిషన్  , క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్  కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ‘ప్రాజెక్ట్ జెడ్’ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. 'మాయవన్' (Maaya One) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తాజాగా సందీప్ కిషన్  బర్త్ డే సందర్భంగా మేకర్స్ పవర్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.  ఈ ఎక్సయిటింగ్ ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటినీ పెంచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్  హీరోయిన్‌గా నటిస్తోంది. టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఉండబోతుంది. ఈ చిత్రానికి కార్తీక్ తిల్లై & కవిన్ రాజ్ డీవోపీలుగా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్  సంగీతం అందిస్తున్నారు.



bottom of page