top of page
MediaFx

ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్టం..?


పుట్టు మచ్చల గురించి మనం ఇదివరకే చాలా తెలుసుకున్నాం. శరీరంలోని కొన్ని అవయవ భాగాలపై పుట్టు మచ్చలు ఉంటే కలిసి వస్తాయి. అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు. వీటిని అశుభంగా భావిస్తారు. మరి సముద్ర శాస్త్రం ప్రకారం.. ఏయే అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

చెంపపై పుట్టు మచ్చ ఉండటం కూడా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. 

ఛాతీ మధ్యలో పుట్టు మచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్ట వంతులుగా సముద్ర శాస్త్రం చెబుతుంది. ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో మంచి గౌరవంలభిస్తుంది. అలాగే నాభిపైన లేదా దాని చుట్టూ పుట్టుమచ్చు ఉంటే.. అది కూడా శుభ సంకేతంగా చెబుతారు. 

సముద్ర శాస్త్రం ప్రకారం.. పుట్టు మచ్చలు నుదిటిపై ఉంటే.. దాన్ని చాలా శుభ ప్రదంగా భావిస్తారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు.. ధన కొరతను ఎప్పుడూ చూడరు. అదృష్టం వరిస్తుంది. అదే విధంగా గొంతు దగ్గర పుట్టు మచ్చ ఉన్నా శుభమే. 

అదే విధంగా సముద్ర శాస్త్రం ప్రకారం ముక్కుపై పుట్టు మచ్చ ఉంటే.. ఈ వ్యక్తి బాగా సంపాదిస్తాడని అర్థం. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అర చేతిలో పుట్టుమచ్చ ఉంటే.. అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందట.

Related Posts

See All

మహేష్ బాబు డిజాస్టర్ సినిమా తన ఫేవరేట్ అంటున్న కాజల్..

ప్రస్తుతం కాజల్ సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమాల గురించి మాట్లాడింది.

bottom of page