top of page
Suresh D

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు భారీ వర్షాలు..

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సెప్టెంబర్‌ 30, అక్టోబరు 1 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సెప్టెంబర్‌ 30, అక్టోబరు 1 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది. ఫలితంగా, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, నిజామాబాద్‌, మెదక్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. హైదరాబాద్ నగరవ్యాప్తంగా, పరిసర జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌కు కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

bottom of page