🌦️ తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షసూచనను ప్రకటించింది భారత వాతావరణ శాఖ. పలు జిల్లాలను అలెర్ట్ చేసింది. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని తెలిపింది. వాతావరణ వాఖ.
⛈️ వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఆవర్తన ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక.. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 16 జిల్లాలకు రెండు రోజులపాటు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.