top of page

డైరెక్టర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన శ్రుతిహాసన్..🎥✨


స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఇప్పుడు టాలీవుడ్ లో లకీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అవుతున్నాయి.  తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసి సత్తా చాటింది. హిందీలోనూ సినిమాలు చేసింది శ్రుతిహాసన్. ఇదిలా ఉంటే శ్రుతిహాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. ఆమెలో ఓ స్టార్ సింగర్ కూడా ఉన్నారు. తాజాగా శ్రుతిహాసన్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియోలో లోకేష్ హీరోగా నటించాడు, శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేసింది.

తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో లోకేష్ , శ్రుతిహాసన్ అదరగొట్టారు.లోకేష్ తో శ్రుతి హాసన్ ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఈ 18 సెకన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ఇనిమేల్’ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఈసాంగ్ ప్రోమోలో శ్రుతిహాసన్ తన అందాలతో రేచిపోవడమే కాదు లోకేష్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసి వావ్ అనిపించింది. 


bottom of page