top of page
Shiva YT

🌙 రాత్రికి రాత్రే ముఖారవిందాన్ని పెంచే అద్భుతమైన చిట్కాలు..😴

🥥 కొబ్బరి నూనె.. 🌟 చర్మ సమస్యలన్నింటికీ పరిష్కారం కొబ్బరినూనెలో ఉంది. కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చర్మం మంట తగ్గుతుంది. టాన్ తొలగిపోతుంది. చర్మం తేమగా ఉంటుంది. నైట్ క్రీమ్‌తో 1 టీస్పూన్ కొబ్బరి నూనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. మంచి మసాజ్ చేసి నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం మంచి నీటితో ముఖం కడగాలి. అయితే, చర్మం మొటిమల బారిన పడే అవకాశం ఉన్నట్లయితే, కొబ్బరి నూనె వాడకుండా ఉండటం మంచిది. 🥥

🥛 పసుపు, పాలు మాస్క్.. 🌿 పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. పసుపు మొటిమలు, మచ్చలు, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇక పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం ఆకృతిని మెరుగుపరచడంలో, కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. పాలలో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి మీ ముఖమంతా అప్లై చేయాలి. అది ఆరిపోయినప్పుడు నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచాక ముఖం కడగాలి. 🌞

🌿 అలోవెరా, విటమిన్ ఇ.. 🍊 కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, అమినో యాసిడ్స్, సాలిసిలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. మొటిమలను నివారిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్‌ను విటమిన్ ఇ ఆయిల్‌తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వలన ముఖారవిందం పెరుగుతంది. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత మంచి నీటితో కడగాలి. 🌞



bottom of page