top of page

ఈ వారం ఓటీటీ థియేటర్ సినిమాల లిస్ట్ ఇదే..

ఈ వారం ఓటీటీలో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించే సినిమాలేవీ రావడం లేదు. ఇక థియేటర్లో మాత్రం రెండు సినిమాలు సందడి చేయబోతోన్నాయి. ఆ రెండు కూడా మాస్ యాక్షన్ సినిమాలే. అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గానూ గోపీచంద్ సినిమా అలరించనున్నట్టుగా కనిపిస్తోంది.

గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రామబాణం రాబోతోంది. లక్ష్యం, లౌక్యం తరువాత రామబాణం అంటూ రాబోతోన్నారు. ఇందులో డింపుల్ హయతీ హీరోయిన్‌గా నటించింది. లక్ష్యం సినిమాలో జగపతి బాబు కూడా నటించాడు. ఇప్పుడు రామబాణంలోనూ నటించాడు. ఇక ఇన్ని సెంటిమెంట్లు ఉండటంతో సినిమా హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. మే 5న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. మరి వీరి హ్యాట్రిక్ సినిమా హిట్టువుతందా? లేదా? అన్నది చూడాలి.ఇక అల్లరి నరేష్ ఉగ్రం అంటూ అందరినీ యాక్షన్స్‌తో భయపెట్టేందుకు వస్తున్నాడు. నాంది సినిమాలో సీరియస్ పాత్రను చేశాడు. ఇక ఇందులో అయితే పవర్ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఇందులో రక్తపాతం ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద ఈ కథ నడుస్తుందని అర్థం అవుతోంది. ఈ సినిమా మే 5న థియేటర్లోకి రానుంది.

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page