🌧️ హైదరాబాద్‌ను భారీవర్షాలు వణికిస్తున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో నానా యాతనా పడుతున్నారు నగర ప్రజలు. 😢 🌧️
అంతేకాకుండా పలుచోట్ల పిడుగులు పడటంతో ఇళ్లలోని ఫ్రిజ్‌లు, ఏసీలు తదితర ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయాయి. 😢 అంతేకాదు 400 ఏళ్లచరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ మసీద్‌కూడా పిడుగు పడి గోపురం కూలిపోయింది. 😢 🌧️ ఉరుములుమెరుపులతో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలుచోట్ల పిడుగులు పడ్డాయి. 😢 ఈ క్రమంలో హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో వందల ఏళ్లనుంచి చెక్కుచెదరకుండా నిలిచిన కుతుబ్‌షాహీ మసీదు పిడుగుపాటుకు గురైంది. 😢 🌧️ దాంతో మసీదు గోపురం కూలిపోయింది. మసీదు మొత్తం పగుళ్లు ఏర్పడ్డాయి. 😢 పగుళ్లు ఏర్పడటంతో ఈ మసీదు ప్రమాదకర పరిస్థితిలో పడింది. 😢 మరోవైపు ఉరుముల ధాటికి యాకత్‌పురాలో ఓ పురాతన భవనం కుప్పకూలిపోయింది. 😢 నాంపల్లి యుసుఫిన్ దర్గాలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. 💧🏞️🌊