top of page
Shiva YT

🌙 రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదా.. ఈ 5 అలవాట్ల వల్ల ప్రశాంతమైన నిద్ర.. 😴💤

⚠️ వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి టాబ్లెట్లు వేసుకోకూడదు. సరైన నిద్ర కోసం ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 🌼

📵 గాడ్జెట్‌లను స్విచ్ ఆఫ్ చేయండి: చాలా మంది వ్యక్తులు ఎక్కువ సమయాన్ని గాడ్జెట్‌లతో గడుపుతారు. దీనివల్ల కంటిచూపు బలహీనపడుతుంది. ఇది కాకుండా వాటి నుంచి వెలువడే బ్లూ-రే ఆరోగ్యానికి హానికరం. 👀📱

💤 నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు స్క్రీన్‌కు దూరంగా ఉన్నప్పుడు మెలటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ పీనియల్ గ్రంథి నుంచి విడుదలవుతుంది ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది. 🌙💤

📚 పుస్తకాలు చదవాలి: పుస్తకం చదవడం మంచి అలవాటు. దీనివల్ల మనస్సు రిలాక్స్ అవుతుంది. నిద్రించే ముందు మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవవచ్చు. 📖🤓

🥤 వేడిగా ఏదైనా తాగండి: కొన్ని వేడి పానీయాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పసుపు పాలు తాగితే మెదడుకు, పేగుకు ప్రయోజనకరంగా ఉంటుంది. 🥛🍹

🚿 పడుకునే ముందు స్నానం చేయండి: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంచి నిద్ర కోసం స్నానం చేయడం మంచి ఎంపిక. ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది. 💧🛁

🌬️ శ్వాస వ్యాయామాలు చేయండి: నిద్రపోయే ముందు శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. యోగా నిపుణులు, ఆధ్యాత్మిక గురువులు నిద్రించే ముందు శ్వాస వ్యాయామాలు చేయాలని సిఫార్సు చేస్తారు. నిజానికి నిద్రపోయే ముందు ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 💆‍♀️🧘‍♂️

bottom of page