top of page
Shiva YT

అర్థహలాసనoలో కాళ్లను ఇలా రోజూ 20 నిమిషాలు ఉంచగలిగితే.. ⏰👁️

ఆరంభంలో ఇలా 10 నిమిషాల పాటు ఉండాలి. కాస్త కష్టమే అయినా ప్రాక్టీస్ చేసేకొద్దీ అలవాటవుతుంది. నిదానంగా రోజుకి 20 నిమిషాలపాటు అర్థహలాసనం వేయాలి. 🧘‍♂️💪

అర్థహలాసనం వల్ల కలిగే లాభాలు:

మెదడు యాక్టీవ్: అర్థహలాసనం వేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా అందుతుంది. దీంతో మెదడు యాక్టివ్ గా మారుతుంది. దీంతో చురుగ్గా ఉండగలుగుతాం. 🏃‍♂️🌬️

ఆందోళన దూరం: ఒత్తిడితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. 🌞🤸‍♂️

జ్ఞాపకశక్తి పెరుగుతుంది: ఈ ఆసనాన్ని తరుచూ వేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడి తగ్గి.. నిద్ర బాగా పడుతుంది. 🧠💡

బీపీ కంట్రోల్: శరీరంలో రక్తసరఫరా మెరుగుపడి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. 💓🩺

కాళ్ల నొప్పులు తగ్గుతాయి: పొట్టదగ్గర, తొడల్లో ఉండే కండరాలు దృఢంగా మారి కాళ్లనొప్పులు తగ్గుతాయి. పొట్ట, నడుము, తొడల వద్ద ఉండే కొవ్వు కరిగి.. శరీరం చక్కటి ఆకృతిలో ఉంటుంది. 👀👃👄

జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది: ఈ అర్థహలాసనం వేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. అలాగే తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అయ్యే శక్తిని తయారు చేస్తుంది. 🍲👍

bottom of page