🚴♂️ ప్రతిరోజూ వ్యాయామంతో పాటు ఒక గంట సైక్లింగ్ చేస్తే శరీరంలో చాలా మార్పులొస్తాయి. శరీరం ఎక్కువగా అలసిపోకుండా ఉంటుంది. 🏋️♂️ గుండెపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తే.. శరీరంలో పాదాల నుంచి ప్రతి అవయవంలో కదలిక వస్తుంది. 💨
రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. 💓 రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది. తొడల భాగంలో పేరుకున్న కొవ్వు కరిగి.. మోకాళ్లకు కూడా చక్కటి వ్యాయామం అవుతుంది. 💪 బరువు సులభంగా తగ్గవచ్చు. 📉
🚴♂️ డయాబెటీస్ సమస్య ఉన్నవారు సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ను నిరోధించే శక్తి తగ్గి.. ఇన్సులిన్ ను స్వీకరించే శక్తి పెరుగుతుంది. 💉 మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు సైక్లింగ్ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. రోజూ సైక్లింగ్ చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయి. 🌺 హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. సైక్లింగ్ చేయాలంటే ఇప్పుడు అర్జంటుగా రోడ్డుపైనే తొక్కాలని లేదు. 🚴♂️ ఇంట్లోనే ఒక ప్రదేశంలో ఫిట్ చేసుకునే సైకిల్స్ మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే సైక్లింగ్ చేస్తూ.. ఈ బెనిఫిట్స్ అన్నింటినీ పొందవచ్చు. 🌟