top of page

🌄మధ్యప్రదేశ్‌ అందాలను చూస్తే ఆశ్చర్యపోతారు.. 🤩🌟🌿

ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. 🌍 సర్‌ప్రైజ్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఇండియా పేరిట తీసుకొచ్చిన ఈ టూర్‌ ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉంటుంది. 🌃

ఎంచక్కా హైదరాబాద్‌ నుంచి విమానంలో వెళ్లి రావొచ్చు. 🛫 ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 📜

డే1(హైదరాబాద్ – జబల్పూర్): 🚗 సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. రాత్రికి జబల్పూర్ చేరుకొని హోటల్‌కు వెళ్తారు. 🌃 రాత్రిభోజనం చేసి అక్కడే బస చేస్తారు. 🍽️

డే2(జబల్పూర్ – భాండవ్‌ఘఢ్): 🌄 హోటల్‌లో అల్పాహారం చేశాక మార్బుల్ రాక్స్, ధువంధార్ జలపాతాన్ని సందర్శిస్తారు. 🏞️ మధ్యాహ్నం భాండవ్‌గఢ్‌కు బయలుదేరుతారు. 🚌 రాత్రికి భాండవ్‌గఢ్‌ చేరుకొని హోటల్‌లో రాత్రి భోజనం చేసి బస చేస్తారు. 🌌

డే3(భాండవ్‌ఘఢ్): 🏞️ హోటల్‌లో అల్పాహారం చేశాక సఫారీకి వెళ్తారు. 🌿 రాత్రికి భాండవ్‌గఢ్‌లోనే బస చేస్తారు. 🚌

డే4(భాండవ్‌ఘఢ్ – అమర్‌కంటక్): 🌲 హోటల్‌లో అల్పాహారం చేశాక అమర్‌కంటక్‌కు బయలుదేరి వెళ్తారు. 🌅 శ్రీ యంత్ర మందిర్, కలచూరి దేవాలయాలు, నర్మదా నదీ ఘాట్‌ను సందర్శిస్తారు. 🌊 అమర్‌కంటక్‌ లోని హోటల్‌లో రాత్రి భోజనం చేసి, అక్కడే బస చేస్తారు. 🍽️

డే5(అమర్‌కంటక్ – రాయ్‌పూర్): 🚃 హోటల్‌లో అల్పాహారం చేశాక, రాయ్‌పూర్‌కి బయలుదేరుతారు. సాయంత్రానికి రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు. ✈️

ప్యాకేజీ ధరలు ఇలా.. 💰 విమానంలో వెళ్లి వచ్చే ఈ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. 📅 హోటల్‌లో ప్రత్యేకంగా సింగిల్‌ రూం కావాలనుకొంటే రూ. 43100 చార్జ్‌ చేస్తారు. 🛏️ అదే డబుల్‌ షేరింగ్‌ అయితే ఒక్కొక్కరికీ రూ. 35,450, ట్రిపుల్‌ షేరింగ్‌ అయితే రూ. 34050 తీసుకుంటారు. 👥 ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్‌ అవసరం అయితే రూ. 31250, ప్రత్యేకమైన బెడ్‌ అవసరం లేకపోతే రూ. 26850 చార్జ్‌ చేస్తారు. 👨‍👩‍👧‍👦 అలాగే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్‌ లేకుండా రూ. 23300 తీసుకుంటారు. 🛏️💲

Comments


bottom of page