top of page
Shiva YT

🌅 ఐఆర్‌సీటీసీ ‘టెంపుల్ రన్’..ఆహ్లాదకర ప్రయాణం..🌴🌊

📦 ఈ ప్యాకేజీ ధర రూ. 32,250 నుంచి ప్రారంభమవుతుంది. ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ సౌత్‌ ఇండియా టెంపుల్‌ రన్‌ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు 🌍

🛫 డే1(హైదరాబాద్ – త్రివేండ్రం): ఉదయం విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. త్రివేండ్రం హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి అల్పాహారం తీసుకుంటారు. తర్వాత నేపియర్ మ్యూజియం సందర్శిస్తారు. మధ్యాహ్నం పూవార్ ద్వీపాన్ని, సాయంత్రం అజిమల శివాలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి త్రివేండ్రంలో బస చేస్తారు.

🏝️ డే2(త్రివేండ్రం – కన్యాకుమారి): ఉదయాన్నే శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత కన్యాకుమారికి చేరుకుంటారు. సన్‌సెట్ పాయింట్‌ని సందర్శించి.. కన్యాకుమారిలోనే రాత్రి బస చేస్తారు.

🌊 డే3(కన్యాకుమారి – రామేశ్వరం): అల్పాహారం చేశాక రాక్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. తరువాత రామేశ్వరం బయలుదేరుతారు. ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. హోటల్‌లో తనిఖీ చేయండి. రాత్రి రామేశ్వరంలో బస చేస్తారు.

☀️ డే4(రామేశ్వరం): హోటల్‌లో అల్పాహారం చేశాక రామేశ్వరం, దనుష్కోడిలోని స్థానిక దేవాలయాలను సందర్శిస్తారు. (బస్సులు రామేశ్వరం లోపలకు అనుమతించబడవు, అన్ని స్థానిక దేవాలయాలను స్థానిక రవాణా ద్వారా మీ సొంత ఖర్చులతో సందర్శించాల్సి ఉంటుంది). రాత్రికి రామేశ్వరంలోనే బస చేస్తారు.

🌴 డే5(రామేశ్వరం – తిరుచ్చి): అల్పాహారం చేశాక.. అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శించవచ్చు. ఆతర్వాత తంజావూరుకు బయలుదేరుతారు. 4 గంటలు సమయం పడుతుంది. తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం మరో గంట ప్రయాణం చేసి తిరుచ్చికి బయలుదేరి వెళ్తారు. తిరుచ్చిలో నే రాత్రి బస ఉంటుంది.

🏛️ డే6(తిరుచ్చి – మధురై): ఉదయం అల్పాహారం చేశాక శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం మదురైకి బయలుదేరుతారు మూడు గంటలు ప్రయాణం ఉంటుంది. మధురైలోనే రాత్రి బస చేస్తారు.

🌇 డే7(మధురై): అల్పాహారం చేశాక మీనాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం మదురై విమానాశ్రయంలో మిమ్మల్ని తిరిగి డ్రాప్ చేస్తారు. మధ్యాహ్నం విమానం ఎక్కి హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. దీంతో యాత్ర ముగుస్తుంది.

🎒 ప్యాకేజీ ధరలు ఇలా.. హైదరాబాద్ నుంచి విమానంలో పర్యాటకులను తీసుకెళ్తారు. హోటల్లో సింగిల్ రూం ప్రత్యేకంగా కావాలనుకుంటే మొత్తం ప్యాకేజీ విలువ రూ. 50,350 ఉంటుంది. హోటల్‌లో డబుల్ షేరింగ్ అయితే రూ. 37,650 చార్జ్ చేస్తారు. ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 35,950 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్ అవసరం అయితే రూ. 31,500, బెడ్ అవసరం లేకపోతే రూ. 27,750 చార్జ్ చేస్తారు. రెండు నుంచి నాలుగేళ్ల పిల్లలకు రూ. 20,350 తీసుకుంటారు. 🧳

bottom of page