టూర్ వివరాలు ఇవి.. 📅 డే1(హైదరాబాద్-గోవా): హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉదయం 12.50 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.00 గంటలకు గోవాకు చేరుకుంటారు. 🛬 ఐఆర్‌సీటీసీ సిబ్బంది ఎయిర్‌పోర్టులో మిమ్మల్ని రిసీవ్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం 6:30 గంటలకు జువారీ నదిని తిలకిస్తారు. 🌆 రాత్రి భోజనం తర్వాత హోటల్లో బస చేస్తారు.
📅 డే2(దక్షిణ గోవా): హోటల్‌లో అల్పాహారం చేశాక, దక్షిణ గోవా సందర్శనకు బయలుదేరుతారు. 🏞️ పాత గోవా చర్చి (బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, ఆర్కియాలజికల్ మ్యూజియం & పోర్ట్రెయిట్ గ్యాలరీ), వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్, మిరామార్ బీచ్ సందర్శిస్తారు. 🚤 సాయంత్రం 4:30 గంటలకు ఆరుగంటల నుంచి మాండోవి నదిలో బోట్ క్రూయిజ్‌ని ఆస్వాదించవచ్చు. 🌙 రాత్రికి తిరిగి హోటల్‌కి చేరుకొని భోజనం చేసి బస చేస్తారు.
📅 డే3(ఉత్తర గోవా): హోటల్‌లో అల్పాహారం చేశాక ఉత్తర గోవా పర్యటనకు బయలుదేరుతారు. 🏰 ఫోర్ట్ అగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ లను సందర్శిస్తారు. 🚤 వాటర్ స్పోర్ట్స్ తిలకించవచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్‌లను సందర్శిస్తారు. 🌴 రాత్రికి హోటల్‌కు చేరుకొని రాత్రి భోజనం చేసి హోటల్లోనే బస చేస్తారు.
📅 డే4(గోవా – హైదరాబాద్): హోటల్‌లో అల్పాహారం చేశాక ఉదయం 11:00 గంటలకు హోటల్‌ను చెక్ అవుట్ చేసి, గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 14:30 గంటలకు హైదరాబాద్ విమానం ఎక్కి, సాయంత్రం 15:55 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
🌈 ప్యాకేజీ ధరలు ఇలా.. 🏨 హోటల్‌లో రూంలో ఒక్కరే ఉండాలనుకుంటే రూ. 27,650 చార్జ్ చేస్తారు. అదే హోటల్‌లో డబుల్‌షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 21,930, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 21,805 చార్జ్ చేస్తారు. 🧒 అనంతరం ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసంర అయితే రూ. 18,035, బెడ్ అవసరం లేకపోతే రూ. 17,665 తీసుకుంటారు. 🚸 అలాగే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్ అవసరం లేకుండా రూ. 17,665 చార్జ్ చేస్తారు. 🌟