top of page
Shiva YT

🌙 రాత్రిపూట నిద్రకు ముందు ఈ ఫేజ్‌ ప్యాక్‌ ట్రే చేశారంటే.. 🛌

❄️ శీతాకాలం ప్రారంభమైంది. 🌨️ రాత్రి పూట, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తున్నాయి. సాధారణంగా శీతాకాలం ప్రారంభమైందంటే జలుబు, దగ్గుతో పాటు చేతులు, కాళ్ళు పొడిబారడం జరుగుతుంది. ❄️

🌡️ వాతావరణ మార్పు ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మం పొడిబారుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. 🏡

🥥 ఓ గిన్నెలో రెండు స్పూన్ల మైదా తీసుకుని అందులో అర చెంచా పసుపు కలుపుకోవాలి. 🥄

🥥 అందులో ఒక స్పూన్‌ తేనె, నెయ్యి కలుపుకోవాలి. 🍯

🥥 అందులో ఒక స్పూన్‌ పెరుగు, పాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. 🥛

🌸 ఈ ఫేస్ ప్యాక్ యాంటీ ఏజింగ్‌లా పనిచేస్తుంది. ఇది స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది. 🌺

🥄 అలాగే, చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. 🛡️

🌿 ఈ ప్యాక్‌ను అప్లై చేసిన తర్వాత 20-25 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి. 🕐

💧 ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరి. 💦

🌃 ఆ తర్వాత ముఖాన్ని శుభ్రమైన టవల్‌తో శుభ్రం చేసుకుని, ముఖానికి నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. 🌙

🌟 నైట్‌ క్రీమ్‌ ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక స్పూన్‌ కొబ్బరి నూనె, గ్లిజరిన్, విటమిన్ ఇ క్యాప్సూల్‌ వేసి కలుపుకుంటే నైట్ క్రీమ్ రెడీ అయినట్లే. 🌟

📅 ఒక రోజు తయారు చేసి ఫ్రిజ్‌లో ఉంచితే 5 రోజుల వరకు దీనిని ఉపయోగించవచ్చు. 🌡️

🌞 ఈ నైట్ క్రీమ్ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా ముఖం సహజకాంతితో వెలిగిపోతుంది. 🌸🌿

bottom of page