చలికాలంలో నారింజ (ఆరెంజ్) పండ్లు పుష్కలంగా లభిస్తాయి. నారింజ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలం అంతా ఈ పండ్లు లభిస్తాయి. నారింజ శరీరానికే కాదు, చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.. ఆరెంజ్ చర్మ కాంతిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
చాలా మంది నారింజ పండ్లను తిన్న తర్వాత తొక్కను పారేస్తుంటారు. కానీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, ఆరెంజ్ తొక్కను విసిరేయకండి. చర్మ సౌందర్యానికి దీనిని ఎలా ఉపయోగించాలంటే..
మొదట నారింజ తొక్కను తొలగించి, బాగా ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత తొక్కలను మొత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి.
దానిలో సోర్ క్రీం వేసుకోవాలి. అలాగే కొన్ని చుక్కల రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతే ఫేస్ ప్యాక్ రెడీ అయినట్లే. ఈ ఫేస్ ప్యాక్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.
అవసరం అయితే ఈ ఫేస్ ప్యాక్‌కి పచ్చి పాలను కూడా జోడించుకోవచ్చు. ఇది చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందుతారు. 🍊🌸