🏃♂️ **ప్రతిరోజూ కొన్ని అడుగులు నడవడం వల్ల మధుమేహంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 🤸♂️🏋️♂️
🏃♂️ రోజు 30 నుంచి 40 నిమిషాల పాటు నడవడం వల్ల మీ శరీరంలోని అదనపు కేలరీలను తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా, రోజువారీ నడక లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుందంటున్నారు. అయితే రోజుకు ఎంత సేపు నడవాలి..? ఎన్ని అడుగులు వేయాలి? అనేది చాలా మందికి వచ్చే అనుమానం. 🕰️🚶♂️
🏃♂️ మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజు 5 నుంచి 7 కి.మీ నడవాలని వాకింగ్ నిపుణులు చెబుతున్నారు. అంటే సుమారు 10,000 అడుగులు వేయాలి అన్నట్లు. 🚶♀️🌄
🏃♂️ 5 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రోజుకు 10,000 నుండి 15,000 అడుగులు వేయాలని, అదే 11 నుంచి 40 సంవత్సరాల వయసుగల వారు రోజుకు 12,000 అడుగులు నడవడం ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేస్తున్నారు నిపుణులు. 🏞️🏃♀️
🏃♂️ రోజువారీ నడక ఒక వ్యక్తి 40 సంవత్సరాల వయస్సులో 11,000 అడుగులు వేయాలి. 50 సంవత్సరాల వయస్సులో 10,000 అడుగులు, 60 సంవత్సరాల వయస్సులో 8,000 అడుగులు వేయాలని సూచిస్తున్నారు. (గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.) 🔄👟