సర్వాంగాసనం: 🧘♂️ సర్వాంగాసనం వేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అదే విధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఆసనం వేయడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గడమే కాకుండా రక్త హీనత, స్పెర్మ్ లోపం కూడా కంట్రోల్ అవుతాయి. థైరాయిడ్ సమస్య కూడా తగ్గుతుంది. జీర్ణ క్రియ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. పొత్తి కడుపు ఊబకాయం సమస్యల కూడా ఉండదు.
ఊర్ద్వ ధనురాసనం: 🧘♀️ ఊర్ధ్వ ధనురాసనం చేయడం వల్ల జీర్ణశక్తికి చాలా మంచిది. మొదటలో ఈ ఆసనం లేసేటప్పుడు గొడ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల.. కొలెస్ట్రాల్ అదుపు అవుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలా వెన్నుముక అనేది స్ట్రాంగ్ అవుతుంది. వయసు పైబడినా వీపు వంగదు.
కపాలభాతి ప్రాణాయామం: 🌬️ కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది. ఈ ఆసనం చేయడానికి ధ్యాన భంగిమలో కూర్చుని.. ఓ పది నిమిషాల పాటు శ్వాస మీద ధ్యాస పెట్టాలి.
శలభాసనం: 🦋 శలభాసనం వేయడం వల్ల కూడా కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. వెన్నుముక సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ ఆసనంతో ఊబకాయం కూడా తగ్గుతుంది.
అర్ధమత్స్యాసనం: 🐠 కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయాలి అనుకునే వారు అర్ధమత్స్యాసనం కూడా వేయవచ్చు. ఆ ఆసనం వేయడం ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీర్ణ క్రియ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు కూడా నియంత్రించబడతాయి.