top of page
Shiva YT

🌱🌰 ఉల్లికాడలతో ఎన్నో ప్రయోజనాలు..🌿

🌰 ఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది. ఉల్లికాడలో కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ ఉన్నాయి.

ఉల్లికాడలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయ పడుతుంది. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఉల్లి కాడలు దివ్య ఔషధంగా చెబుతారు.. ఉల్లి కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది.

🩸 ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి. వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది. ఉల్లికాడలు ఎక్కువగా వాడేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. వీటిలోని ఫొలేట్లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


bottom of page