top of page
Shiva YT

🏃‍♂️ అవుట్ సైడ్ రన్నింగ్ వర్సెస్ ట్రెడ్మిల్ రన్నింగ్..

అవుట్ సైడ్ రన్నింగ్ వల్ల లాభాలు..

అవుట్ సైడ్ రన్నింగ్ చేయడం వల్ల ఎక్కువ శక్తి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.

బయట రన్నింగ్ చేయడం వల్ల ఎముకలు కూడా గట్టి పడతాయి. కాంక్రీట్ ఉన్న ఉపరితలంపై పరిగెత్తినప్పుడు.. కాళ్ల పై ఎక్కువ ప్రభావం పడుతుంది. దీని వల్ల ఎముకలు మరింత బలంగా తయారవుతాయి. బయట రన్నింగ్ చేసే వారి కాళ్లు బలంగా తయారవుతాయి.

చర్మంపై సూర్య రశ్మి అనేది ఎక్కువగా పడుతుంది. దీని వల్ల విటమిన్ డి శరీరానికి బాగా అందుతుంది. అదే విధంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

బయట రన్నింగ్ చేయడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, కోపం వంటివి తగ్గే ఛాన్స్ ఉంది. మానసిక ఆనందం కూడా పెరుగుతుంది.

అవుట్ సైడ్ రన్నింగ్ వల్ల ప్రయోజనాలు..

ట్రెడ్‌ మిల్‌పై ఏ సమయంలోనైనా రన్నింగ్ చేయవచ్చు. అదే విధంగా అన్ని కాలాల్లో బయట పరిగెత్తడం వీలు కాకపోవచ్చు. కానీ ట్రెడ్ మిల్‌పై ఎప్పుడైనా రన్నింగ్ చేయవచ్చు.

కార్డియోవాస్కులర్ ప్రయోజనాల కోసం రన్నింగ్ చేసే వారు ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అదే విధంగా మారథాన్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం బయట పరిగెత్తడం బెటర్. ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేసినా.. అవుట్ సైడ్ రన్నింగ్ చేసినా.. మంచి ప్రయోజనాలే ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం బయట రన్నింగ్ చేస్తేనే మంచిది. 🏃‍♀️

bottom of page