top of page

🚶‍♂️💨 వేగంగా నడిస్తే ఆ సమస్య పరార్‌.. పరిశోధనల్లో ఆసక్తిర విషయాలు..🕵️‍♂️

ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. 🌍 భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 🌐 మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్‌ రోగులు పెరుగుతున్నారు. 🥗

టైప్‌ 2 డయాబెటిస్‌ రోగులపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 🤔 బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్టోర్ట్స్‌ మెడిసిన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. వేగంగా నడవడం వల్ల టైప్‌2 డయాబెటిస్‌ సమస్య తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 🧪

ప్రతిరోజూ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్‌ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. 🏃‍♂️ పరిశోధనల్లో భాగంగా అమెరికా, బ్రిటన్‌లకు చెందిన 508121 మందిని పరిగణలోకి తీసుకున్నారు. 🌐

నడక వేగం పెరిగే టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 15 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. 📊 గంటకు కనీసం 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్‌ బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. 🚴‍♀️ ఈ లెక్కన పురుషులు నిమిషానికి 87 అడుగులు వేయాలని, మహిళలు నిమిషానికి 100 అడుగులు నడిస్తే డయాబెటిస్‌కు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు. 🏃‍♀️

ఇదిలా ఉంటే 2045 నాటికి టైప్‌ 2 డయాబెటిస్‌ బారిన పడే వారి సంఖ్య 537 మిలియన్ల నుంచి 783 మిలియన్లకు చేరుతుందని అంచనా. 📈 ఇక ఇరాన్‌లోని సెమ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు వేగంగా నడవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. 🤓 ఇలా చేయడం వల్ల కేవలం డయాబెటిస్‌ నివారించడమే కాకుండా, అనేక సామాజిక, మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 🌟

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page