మొదటి రోజు హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఐఆర్‌ఓ యాత్రినివాస్ నుంచి బస్సు జర్నీ ప్రారంభమవుతుంది. బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ ఆఫీస్‌కు సాయంత్రం 4 గంటకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం తర్వాత బెంగళూరుకు జర్నీ ఉంటుంది.
రెండో రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. అనంతరం ఫ్రెషప్ అయిన తర్వాత 8.30 గంటలకు స్థానికంగా సైట్ సీయింగ్ ఉంటుంది. ఇందులో బాగంగా బుల్ టెంపుల్, లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్ కవర్ అవుతాయి. హోటల్‌కు తిరిగి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు.
ఇక మూడో రోజు ఉదయం 4 గంటలకు ఊటికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఊటీలోని హోటల్ ఛార్రింగ్ క్రాస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బొటానికల్ గార్డెన్, బోటింగ్ వంటి ప్రదేశాలు కవర్ అవుతాయి. సాయంత్రం 6 గంటలకు తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
4వ రోజు ఉదయం 9 గంటలకు ఊటీ నుంచి బయలుదేరి, మైసూర్‌కు సాయంత్రం 6 గంటలకు చేరకుంటారు. 6 గంటల నుంచి 8.30 గంటల వరకు బ్రిందావన్ గార్డెన్ విజిట్ ఉంటుంది. అనంతరం రాత్రి 9 గంటలకు హోటల్‌కు చేరుకుంటారు.
5వ రోజు మైసూర్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరుతారు. లోకల్ సైట్ సీయింగ్‌లో భాగంగా చాముండేశ్వరీ టెంపుల్, మైసూర్ మహారాజ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ కవర్ అవుతాయి. ఇక మైసూర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఇక ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 11,999గా, చిన్నారులకు రూ. 9,599గా నిర్ణయించారు. ఒకవేళ సింగిల్ ఆక్యూపెన్సీ అయితే అదనంగా రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా వోల్వో కోచ్ బస్సులు ఉంటాయి. 🚍🌲💸