top of page
Shiva YT

🍅 టమాటాతో హైబీపీకి చెక్ పెట్టొచ్చా..

🍅 టమాటాలు నిత్యవసర వస్తువు. టమాటా లేకపోతే ఆ కూరలో రుచే ఉండదు. అందుకే రేటు ఎక్కువైనా తక్కువైనా కొంటారు. ఒక్క కాయ వేసినా ఆ కూర రుచే మారిపోతుంది. టమాటాలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటివి ఉంటాయి.

ఇవి మూడూ శరీరానికి మంచి చేసేవే. టమాటాలో ఉండే లైకోపీన్ గుండెకు చాలా మంచి చేస్తుంది. రోజుకు 110 గ్రాముల కంటే ఎక్కువ టమాటాలు తినడం వల్ల అధిక రక్త పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. పొటాషియం ఉన్న ఆహారాలు తీసుకుంటే బీపీ నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా దీర్ఘకాలిక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే మరీ ఎక్కువగా కాకుండా సమతుల్యంగా టమాటాను తీసుకుంటే మంచిదే.🌿 హైబీపీని కంట్రోల్ చేసుకోవాలంటే చిట్కాలు:

🏋️‍♂️ బరువును అదుపులో ఉంచుకోవాలి.

🤸‍♂️ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

🚫 ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు.

🚭 మధ్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

😡 ఒత్తిడిని, కోపం, ఆందోళన వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి.

🍏 పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

🌱 ఇలా మీ లైఫ్‌ స్టైల్‌లో పలు మార్పులు చేసుకోవడం వల్ల హైబీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అదే విధంగా మసాలాలు, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటూ ఉంటే.. హైబీపీ రాకుండా జాగ్రత్త పడొచ్చు. 🌿

bottom of page