top of page
Shiva YT

🌆🚆 తక్కువ ధరలో హైదరాబాద్-షిర్డీ టూర్.. 2 రాత్రులు, 3 రోజులు ప్యాకేజీ..🌆

🌆🚆 హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని 'సాయి సన్నిధి హైదరాబాద్' అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 🌆🚆

📅 అక్టోబర్ 25న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. ప్రతీ బుధవారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. 2 రాత్రులు, 3 రోజుల పాటు టూర్ ప్యాకేజీ ఉంటుంది. 📅

🚄 ఇక ఈ టూర్ ఎలా ప్రారంభమవుతుందంటే.. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు టూర్ ప్రారంభమవుతుంది. 🚄

🚂 అజంతా ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ నెంబర్ 17064 సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. 🚂

🌄 మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌ సోల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. 🌄

🏨 అక్కడి నుంచి షిర్డీకి మరో వాహనంలో చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఫ్రెషప్‌ అవుతారు. 🏨

🕍 అనంతరం షిర్డీలో ఆలయాన్ని సందర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్‌ నుంచి చెక్ అవుట్ అవుతారు. 🕍

🚂 అనంతరం శని శిగ్నాపూర్‌కు వెళ్తారు. అక్కడి నుంచి నాగర్‌ సోల్‌ రైల్వే స్టేషన్‌కు బయలుదేరుతారు. 🚂

🌌 రాత్రి 8.30 గంటలకు మళ్లీ తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. 🌌

🚄 రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. 🚄

🌇 ఇక ఈ టూర్ ప్యాకేజీ విషయానికొస్తే.. సింగిల్ షేరింగ్ కోణికి రూ. 13,100గా ఉండగా, డబుల్ షేరింగ్ కోణికి రూ. 8020గా ఉంటుంది. 🌇

🛏️ ట్రిపుల్ షేరింగ్ విషయానికొస్తే రూ. 6390గా నిర్ణయించారు. 🛏️

🍽️ కంఫర్ట్ క్లాస్ కోచ్‌లో ఈ ధరలు ఉంటాయి. 🍽️

🏨 స్టాండర్డ్ క్లాస్ విషయానికొస్తే సింగిల్ షేరింగ్ కోణికి రూ. 11,410కాగా, డబుల్ షేరింగ్ కోణికి రూ. 6330గా నిర్ణయించారు. 🏨

🏨 హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ వంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 🏨

bottom of page