top of page
Shiva YT

ఈ ప్రదేశాలను ఇజ్రాయిలీలు ఎక్కువగా పర్యటించడానికి ఇష్టపడతారు.. 😊

ఇజ్రాయిల్ పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడే కొన్ని ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రదేశాల అందం సంస్కృతి ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ఇజ్రాయిల్ పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడే భారతదేశంలోని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. 😄

కసోల్, హిమాచల్ : ఇజ్రాయిల్ పర్యాటకులు భారతదేశంలోని పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. 🏞️ ప్రకృతి అందాలతో చుట్టుముట్టబడిన కసోల్‌లో యూదుల సంస్కృతిని చూడగలిగే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇజ్రాయిలీ ఫుడ్ షక్షౌక కూడా ఇక్కడి రెస్టారెంట్లలో వడ్డిస్తారు. 🍽️

పుష్కర్, రాజస్థాన్ : చాబాద్ హౌస్ ఆఫ్ పుష్కర్‌లో ఎక్కువ మంది షాప్ ఓనర్స్ ఇజ్రాయిల్ భాష హర్బును మాట్లాడతారు. 🗣️ పుష్కర్ కు వచ్చిన తర్వాత ఇజ్రాయిల్‌ పర్యాటకులు స్థానికుల ఇంట్లోనే విడిది చేస్తారు. వీరికి రాజస్థానీ సంస్కృతి అంటే చాలా ఇష్టం. 🕌

ధరమ్‌కోట్, కాంగ్రా : హిమాచల్‌లోని ధరమ్‌కోట్ ఇజ్రాయిల్ పర్యటకులకు ఇష్టమైన భారతీయ పర్యాటక ప్రదేశం అని నమ్మకం. 🏰 పర్వతాలతో చుట్టుముట్టబడిన ధరమ్‌కోట్‌లో ప్రతి సంవత్సరం యూదుల నూతన సంవత్సరాన్ని రోష్ హషానా వరకు జరుపుకుంటారు. 🎉

మలానా, హిమాచల్ : హిమాచల్ ప్రదేశ్ హిల్ స్టేషన్లను విదేశీ పర్యటకులు ఎంతో ఇష్టపడతారు. 🏔️ హిమాచల్‌లోని మలానా సంస్కృతి ఇజ్రాయిలీలను ఆకర్షిస్తుంది. మలానా అందాలే కాదు.. ఇక్కడి ఆహారం కూడా ఇజ్రాయెల్ పర్యాటకులకు చాలా ఇష్టం. 🍛👍

bottom of page