top of page

🏝️ వెళ్లొద్దామా గోవా..తక్కువ ధరలోనే విమాన ప్రయాణం..

🌴 గోవా రిట్రీట్‌ ప్యాకేజీ వివరాలు.. 🏖️ ఈ టూర్‌ ప్యాకేజీ తీసుకుంటే హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. 🛫 మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు ఉంటుంది. నవంబర్‌ 2వ తేదీన ఒక బ్యాచ్‌, నవంబర్‌ 11న మరో బ్యాచ్‌ వెళ్తుంది. 📅 ఈ టూర్‌లో సౌత్ గోవా, నార్త్ గోవాలోని పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, చర్చిలు, ఆలయాలు కవర్‌ అవుతాయి. 🌅

🌞 పర్యటన ఇలా.. 🕊️ మొదటి రోజు హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12.50గంటలకు విమానంలో గోవా బయలుదేరుతారు. 🛬 జువారీ నదిని తిలకిస్తారు. 🏛️ రెండో రోజు పాత గోవా చర్చి (బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, ఆర్కియాలజికల్ మ్యూజియం & పోర్ట్రెయిట్ గ్యాలరీ), వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్, మిరామార్ బీచ్‌ను సందర్శిస్తారు. 🏰 సాయంత్రం మాండోవి నదిలో బోట్ క్రూయిజ్‌ని ఆస్వాదించవచ్చు. 🚤

🌅 మూడో రోజు ఫోర్ట్ అగ్వాడా, కండోలిమ్ బీచ్, బాగా బీచ్‌లను సందర్శిస్తారు. 🌊 వాటర్ స్పోర్ట్స్ తిలకించవచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్‌లను సందర్శిస్తారు. 🌴

🌄 నాలుగో రోజు గోవా నుంచి రిటర్న్‌ ఫ్లైట్‌ తీసుకొని మధ్యాహ్నం 14.30గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.

💰 గోవా రిట్రీట్‌ ప్యాకేజీ ధరలు.. సదుపాయాలు.. 💸 ఈ టూర్‌ ప్యాకేజీలు రూ. 21,805 నుంచి ప్రారంభమవుతాయి. 🏨 ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికీ రూ. 21,805, డబుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికీ రూ. 21,930, సింగిల్‌ షేరింగ్‌ అయితే రూ. 27,650 చార్జ్‌ చేస్తాయి. 👨‍👩‍👧‍👦 పిల్లలకు ప్రత్యేకంగా చార్జ్‌ చేస్తారు. 🚼 ఆ ప్యాకేజీలో ప్రయాణ చార్జీలతో ఏసీ హోటల్‌ వసతి కల్పిస్తారు. 🏨 ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, వసతి కల్పిస్తారు. 🍽️ గోవాలో లోకల్‌ ప్రయాణాలకు ఏసీ వాహన సదుపాయం ఉంటుంది. 🚗 మధ్యాహ్నం భోజనంతో పాటు ఇతర పానీయాలు, చిరుతిళ్లను పర్యాటకులే భరించాలి. 🥤 ఐఆర్‌సీటీసీ ఎస్కార్ట్‌ సేవలు ఉంటాయి. 👮‍♂️ పర్యటకులకు ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సదుపాయం ఉంటుంది. 🧳 మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అధికారిక వెబ్‌ సైట్లోకి వెళ్లి అందులో టూర్‌ ప్యాకేజీల ఆప్షన్లో గోవా రిట్రీట్‌ ప్యాకేజీని ఎంపిక చేసుకొని వివరాలు తెలుసుకోవచ్చు. 🏝️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page