top of page
Shiva YT

చర్మంపై నల్లని ట్యాన్‌ ఇట్టే వదలిపోతుంది! 😟💆‍♀️

వేసవిలోనే కాదు చలికాలంలోనూ చర్మంపై టాన్ సమస్య వేధిస్తుంది. ఈ సమయంలో ఎండ, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతింటుంది. నల్లని టాన్ ఏర్పడి, చర్మం రంగు కోల్పోతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నిపుణుల మాటల్లో మీకోసం.. 🤷‍♀️💬

చాలా మంది పార్లర్‌కు వెళ్లి టాన్ రిమూవల్ ఫేషియల్ చేయించుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల డబ్బు ఖర్చు చేయవల్సి వస్తుంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూడా టాన్ తొలగించవచ్చు. ఇంట్లోనే టాన్ తొలగించడానికి పుల్లని పెరుగు, నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. ఈ రెండు పదార్థాలు టాన్‌ను తొలగించడానికి సహాయపడతాయి. ఒక గిన్నెలో పుల్లని పెరుగు తీసుకుని, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకోవాలి. 🍯🍋

అలాగే శనగ పిండి, తేనెను కూడా ఉపయోగించవచ్చు. టాన్‌ను తొలగించడంలో శనగ పిండి చాలా మేలు చేస్తుంది. ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని, దానికి తేనె కలపుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి, పేస్టులా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. 🍵🍅

ముఖంపై టాన్ వదిలించుకోవడానికి టొమాటోని కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే టొమాటో టాన్ తొలగించుకోవడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. 🍅🤔

టమోటా ముక్క తీసుకుని, ముఖంపై రుద్దుకోవాలి. ఆ తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేసుకోవాలి. ఇది స్నానం చేయడానికి ముందు ఉపయోగించాలి. ఇలా వారంలో రెండు రోజులు పాటిస్తే చాలు.. ఫలితం మీరే చూస్తారు. 🔄🌟

bottom of page