top of page
Shiva YT

🌿 తులసి ఆకులతో కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..

🌱 తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని ప్రభావం తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. తులసి హెయిర్ ప్యాక్‌ని ఉపయోగించి నెరిసిన జుట్టును వదిలించుకోండి. దీని కోసం ముందుగా తులసి ఆకులు, పెరుగు తీసుకోండి.

🍵 ముందుగా ఒక కప్పు తులసి ఆకులను తీసుకోండి. దానికి నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తులసి ఆకులను మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. దానికి పెరుగు వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి 1 గంట పాటు అలాగే ఉంచాలి. అప్పుడు సాధారణ షాంపూతో జుట్టును కడగాలి. ఈ హోం రెమెడీని వారానికి రెండు సార్లు ఉపయోగించండి. ఇలా చేస్తే మీ తెల్ల జుట్టు ఎప్పటికీ నల్లగా మారుతుంది.

🥛 పెరుగులో జుట్టుకు కావాల్సిన ప్రోటీన్, జింక్, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. తలలో ఉండే గుణాలు జుట్టులోని మురికి శుభ్రం చేసేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వినియోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

🌿 తులసి ఆకులు స్కాల్ప్ నుంచి జుట్టు పొడవుగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణం మారడం కారణంగా వచ్చే హెయిర్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. నిర్జీవమైన జుట్టుకు సరైన పోషణ అందించేందుకు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడుతుంది. పాడైపోయిన జుట్టును తిరిగి రిపేర్‌ చేస్తుంది. 🌿✨🌸

bottom of page