👨🔬📚 జుట్టుకు మీ అలవాట్లే శత్రువులుగా ఎలా మారుతున్నాయో తెలుసా.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు బట్టల బాధితులుగా మారుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
🌀 ఎనర్జీ డ్రింక్స్.. 🔬 బీజింగ్‌లోని సింఘువా యూనివర్సిటీలో జుట్టు రాలడంపై ఓ అధ్యయనం జరిగింది.
ఎనర్జీ డ్రింక్స్ లేదా చక్కెర పానీయాలు తాగడం అలవాటు ఉన్నవారిలో జుట్టు రాలడం అధికంగా ఉంటుందని.. బట్టతల సమస్య ఎదుర్కోవలసి ఉంటుందని చైనా పరిశోధకులు తెలిపారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ ప్రభావం పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనం ప్రకారం, 13 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారు దీని బారిన పడుతున్నారు.
🔍 అధ్యయనం ఎలా జరిగిందంటే..? 📊 ఈ అధ్యయనాన్ని 1000 మంది పురుషులపై చేశారు. ముందుగా వారానికి 3 లీటర్ల ఎనర్జీ డ్రింక్స్ తాగాలని సూచించారు. పరిశోధన తర్వాత రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ తాగిన వ్యక్తికి జుట్టు రాలిపోయే ప్రమాదం 42 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తెలిసినట్లు వెల్లడించారు.
🍔 హాని కలిగిస్తున్న ఫాస్ట్ ఫుడ్ 🚫 ఫాస్ట్ ఫుడ్ అలవాటు ఉన్నవారు లేదా తక్కువ కూరగాయలు తినేవారిలో కూడా జుట్టు రాలడం మాత్రమే కాకుండా తరచుగా ఆందోళనకు గురవుతారని అధ్యయనం వెల్లడించింది. ఫాస్ట్ లేదా జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కేన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు కారణమని భావించే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.