విశాఖపట్నం-అరరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. 🚆🌅 కేవలం ఒక్కరోజులోనే అరకు లోయతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించేలా ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చారు. 🌐
విశాఖపట్నం చేరుకున్న ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీ ద్వారా ఎలాంటి టెన్షన్ లేకుండా అరకు టూర్‌ను పూర్తి చేసుకోవచ్చు. 🎉 ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ఉదయం 6.45 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. 🕰️ ట్రైన్ నెంబర్ 08551 రైలు ఎక్కాల్సి ఉంటుంది. 🚞 గుహలు, బ్రిడ్జిలు, ప్రకృతి రమణీయత నడుమ ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. 🏞️ అరకుకు ఉదయం 10.55 గంటలకు చేరుకుంటుంది. అక్కడ ట్రైబ్ మ్యూజియంతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. 🏰 అనంతరం లంచ్ ఉంటుంది. 🍽️ లంచ్ పూర్తికాగానే విశాఖ తిరుగు ప్రయాణం ఉంటుంది. 🚌 తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్ర గుహల సందర్శన ఉంటుంది. 🌲 సాయంత్రం తిరిగి విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. ఈసీ క్లాస్‌లో పెద్దలకు రూ. 4450కాగా చిన్నారులకు రూ. 4080గా నిర్ణయించారు. 🎫 ఎస్‌ఎల్ క్లాస్‌లో ప్రయాణిస్తే పెద్దలకు రూ. 2285, చిన్నారులకు రూ. 1915గా నిర్ణయించారు. 💼 ఇక 2ఎస్ క్లాస్ విషయానికొస్తే పెద్దలకు రూ. 2130, చిన్నారులకు రూ. 1760గా నిర్ణయించారు. 🚊 అరకులో పలు ప్రాంతాలను సందర్శించడానికి నాన్ ఏసీ బస్సులతో పాటు మీల్స్, బ్రేక్ ఫాస్ట్, బొర్ర గుహల ఎంట్రీ ఫీజు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. 🚌🍴