top of page

🌈👩‍🦰 అరటిపండుతో జుట్టు రాలడం సమస్యను దూరం చేసే మార్గాలు..! 🌿💇

హెయిర్ కలరింగ్, స్టైలింగ్ ఉత్పత్తులలో ఉండే టాక్సిక్ కెమికల్స్ జుట్టు రాలడానికి కారణమవుతాయి. మీ జుట్టుకు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం, ఉపయోగించడం ఉత్తమం. 🌱 మీ జుట్టు ఆరోగ్యానికి అరటిపండు హెయిర్ మాస్క్ ఉపయోగించినట్టయితే, గొప్ప మార్పును గమనిస్తారు. 🌿 అరటిపండు హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందం..

అరటిపండు, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్సీలో గ్రైండ్ చేయండి. 💫 దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 💦 ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దీన్ని ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. 🌞

పొడిబారిన, చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి మరొక ఇంటి నివారణ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. 💆‍♀️ దీనకోసం ఒక టేబుల్ స్పూన్ కండీషనర్, సగం గుజ్జు అరటిపండు, ఒక కప్పు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. 💖 దీన్ని మీ తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. 🚿

బాగా పండిన అరటిపండును మెత్తగా చేసుకుని అందులో సగం టేబుల్ స్పూన్ల తేనె, సగం టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్‌ చేయాలి. 💧 ఆ తర్వాత అందులో ఒక గుడ్డును పగులగొట్టి వేసి బాగా కలుపుకోవాలి. 🌺 తయారైన హెయిర్ ప్యాక్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల దాకా బాగా అప్లై చేయండి. 💆‍♂️ తలపై కాసేపు షవర్ క్యాప్‌ ధరించాలి. ఒక గంటపాటు బాగా ఆరిన తర్వాత షాంపూ, కండీషనర్ అప్లై చేయండి. 🌈 వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది. 💖


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page