బీట్‌రూట్- అలోవెరా జెల్: మెరిసే చర్మం పొందడానికి మీరు బీట్‌రూట్‌తో కలబంద జెల్‌ను ఉపయోగించవచ్చు. దీంతో చర్మం మెరిసిపోతుంది.
దీని కోసం మీరు ముందుగా అలోవెరా జెల్‌ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 2 చెంచాల బీట్‌రూట్ జెల్‌ని కలపండి. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసిన తరువాత మీ ముఖం మీద అప్లై చేసి 2 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తేలికపాటి చేతులతో ముఖాన్ని మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని కారణంగా చర్మం చాలా మెరుస్తుంది. ముఖంపై మచ్చల సమస్య కూడా దూరమవుతుంది. 🌈
మీ ముఖం కాంతివంతంగా ఉండాలంటే బీట్‌రూట్‌తో కలిపిన ముల్తానీ మిట్టిని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఛాయ కూడా మెరుగుపడుతుంది. ఇందుకోసం ముల్తానీ మిట్టిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో 1 బీట్‌రూట్‌ను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయండి. కావాలంటే నిమ్మరసం లేదా పెరుగు కూడా వేసుకోవచ్చు. తర్వాత బాగా కలపాలి. మీరు పేస్ట్‌ను ఇంకా పలుచగా చేయాలనుకుంటే మీరు రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి. తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. దీని తరువాత, మీ చేతిలోకి నీళ్లు తీసుకుని మీ ముఖాన్ని కొద్దిగా తడిపి బాగా మసాజ్ చేయండి. సుమారు 2 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసి టవల్ తో క్లీన్‌గా తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ✨💆♀️