శీతా కాలంలో చన్నీటి స్నానం చేస్తే..: శీతా కాలంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల బాడీలో వాతవ అనేది పెరుగుతుంది. దీని వల్ల నొప్పులు, కండరాల నొప్పులు, చర్మం పొడి బారడం, బలహీనమైన జీవక్రియ వంటి సమస్యలు ఎదురవుతాయి.
అంతే కాకుండా శరీరం నొప్పులు తీరవు. కానీ ఒకవేళ క్రమం తప్పకుండా చన్నీటితో స్నానం చేసే వారైతే మాత్రం.. శీతా కాలంలో కూడా చన్నీటి స్నానం చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎలాంటి భంగం కలిగించదు. అంతే కాకుండా చన్నీటి స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతంది. తెల్ల రక్తకణాలు అధిక శాతం, జీవ క్రియ రేటు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 🩸
శీతా కాలంలో వేడి నీటి స్నానం చేస్తే..: వింటర్ సీజన్ లో వేడి నీటితో స్నానం శరీర వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు, శరీరానికి ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా వేడి నీళ్లు చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం ద్వారా జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చలి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. 🛁❤️
ఆయుర్వేదం ప్రకారం ఏ నీటితో చేస్తే మంచిది: ఆయుర్వేదం ప్రకారం చన్నీటి స్నానం చేయడం వల్ల వాతాన్ని పెంచడమే కాకుండా చలి కూడా పెరుగుతుంది. కాబట్టి శరీరం వేడిని కాపాడుకోవడానికి చాలా కష్ట పడాలి. చలి కారణంగా వణుకు తగ్గడమే కాకుండా ఒత్తిడి, కండరాల నొప్పులు, సీజనల్ గా వచ్చే వ్యాధులనూ దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 🌿💧