top of page
MediaFx

మెయిల్‌లో పెద్ద ఫైల్స్‌ను ఎలా పంపించుకోవాలో తెలుసా..?

ఒకప్పుడు ఈమెయిల్‌ను కేవలం కొందరు మాత్రమే వినియోగించేవారు. స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈమెయిల్స్‌ ప్రతీ ఒక్కరికీ అనివార్యంగా మారింది. దీంతో కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్‌ ఉండాల్సిన పరిస్థితి. అయితే జీమెయిల్‌లో మనకు తెలియని ఎన్నో సీక్రెట్‌ ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా.? ఇలాంటి వాటిలో ఓ ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఫొటోలు క్వాలిటీ తగ్గకుండా ఉండాలన్నా, ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ వంటి వాటిని మెయిల్స్‌ రూపంలో పంపించుకుంటాం. అయితే నిడివి ఎక్కువగా ఉన్న వీడియోలు, డాక్యుమెంట్స్‌ పరిస్థితి ఎలా.? 25 ఎమ్‌బీ కంటే ఎక్కువ డేటా ఉన్న కంటెంట్‌ను మెయిల్‌లో సెండ్‌ చేయడానికి జీమెయిల్‌ అనుమతించింది. అయితే ఓ చిన్న ట్రిక్‌ ఉపయోగిస్తే ఎక్కువ స్టోరేజ్‌ ఉన్న ఫైల్స్‌ను కూడా సులభంగా మెయిల్స్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ట్రిక్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం ముందుగా మీ జీమెయిల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాల్సి ఉంటుంది. అనంతరం మీరు పంపాలనుకుంటున్న ఫొటో, వీడియో లేదా డాక్యుమెంట్స్‌ను గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత జీ- మెయిల్‌ పంపే సమయంలో కుడివైపు స్క్రీన్‌పై కనిపించే డ్రైవ్‌ ఐకాన్‌ సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటిలో ఇన్‌సెర్ట్‌ ఫ్రమ్‌ డ్రైవ్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వెంటనే మీరు డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌, ఫొటోలు కనిపిస్తాయి. మీరు పంపాలనుకుంటున్న కంటెంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

దీంతో మీరు ఎంచుకున్న ఫైల్‌కు సంబంధించిన లింక్‌ను గూగుల్‌ ఆటోమెటిక్‌గా క్రియేట్ చేసి, ఇమెయిల్‌కి పంపిస్తుంది. మెయిల్‌ను పంపించే ముందు.. లింక్‌ను కేవలం రిసీవ్‌ చేసుకున్న వారు మాత్రమే యాక్సెస్‌ చేలాయా.? ఎవరైనా యాక్సెస్‌ చేయొచ్చా.? అనే ఆప్షన్‌ను కనిపిస్తుంది. మీకు నచ్చిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని సెండ్‌ నొక్కితే సరిపోతుంది.

bottom of page