top of page
Suresh D

మీకు లేటుగా నిద్ర లేచే అలవాటుందా.. అయితే ఈ రోగాలన్నీ మూటకట్టుకున్నట్లే..🩺👩‍⚕️

ఆరోగ్యంగా ఉండటానికి మీ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చెడు జీవనశైలి వల్ల మనం వ్యాధుల బారిన పడతాం..

ఆరోగ్యంగా ఉండటానికి మీ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చెడు జీవనశైలి వల్ల మనం వ్యాధుల బారిన పడతాం.. దీనికి మరికొన్ని కారణాలు.. ఒత్తిడి, నిద్రలేకపోవడం, దురలవాట్లు.. అయితే, ప్రస్తుతం బిజీ లైఫ్ వల్ల చాలా మందికి సరిపడా నిద్ర పట్టడం లేదు, దీని వల్ల ఒత్తిడి వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొందరు అర్థరాత్రి వరకు మేల్కొని పని చేస్తారు.. మరికొంత మంది రాత్రి చాలా సేపు నిద్రపోరు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల అనేక రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ం..

జీర్ణక్రియ సమస్య: మీరు ఉదయం వేళ ఆలస్యంగా మేల్కొంటే, మీ జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది. ఇది ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్య పెరిగితే పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యంగా నిద్రలేచేవారికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

మధుమేహం: అధిక రక్త చక్కెర కూడా చెడు జీవనశైలికి సంబంధించిన వ్యాధి. లేటుగా లేస్తే ఆలస్యంగా తింటాం. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా, ఆకలికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. దీని కారణంగా, ప్రజల ఆహారం తీసుకునే విధానం సమతుల్యంగా ఉండదు. చివరకు మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

గుండె జబ్బులు: ఆలస్యంగా నిద్రలేవడం వల్ల తెల్లవారుజామున సూర్యరశ్మిని పొందలేకపోతున్నారు. దీని కారణంగా, శరీరంలో హార్మోన్ల స్థాయి క్షీణించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, రక్తపోటు స్థాయి, చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఊబకాయం: ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉన్నవారిలో జీవక్రియలు కూడా మందగిస్తాయి. దీని కారణంగా, ప్రజలు కేలరీలు బర్న్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం పెరుగుతుంది. ఊబకాయం వల్ల అనేక సమస్యలు పెరుగుతాయి.

ఒత్తిడి, చిరాకు, అలసట: రోజూ ఆలస్యంగా నిద్రలేచే వారు చురుకుడా ఉండరని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. వారంతా చిరకుతోపాటు.. అలసటతో ఉంటారని పేర్కొంటున్నారు.

అందుకే.. ఉదయాన్నే నిద్ర లేవడం, అలాగే.. రాత్రికి సరైన సమయంలో అన్నం తినడం.. నిద్రపోవడం లాంటివి అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.🩺👩‍⚕️

Comentários


bottom of page